ప్లాస్టిక్‌ వదిలేద్దాం.. మేడారాన్ని రక్షిద్దాం

Let’s get rid of the plastic

రెండేళ్లకోమారు నిర్వహించే మేడారం జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటుతోంది. ఆసియా ఖండంలో గిరిజన సాంప్ర దాయాల ప్రకారం జరిగే అతిపెద్ద పండుగ మేడారం జాతర. భారత దేశంలో కుంభమేళ తరువాత అత్య ధిక భక్తులు హాజరయ్యే జాతరగా ప్రాచుర్యం పొంది తెలంగాణ కుంభ మేళగా పిలువబడుతోంది. మాఘశుద్ధపౌర్ణమి గడియలను బట్టి నాలుగు రోజుల పాటు కన్నుల పండుగగా సాగే ఈ మహోత్స వానికి కోటిన్నర మంది భక్తులు తరలివస్తారు.

రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు సమ్మక్క, సారక్కల ను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దట్టమైన అడవ్ఞలు, కొండకోనల మధ్య నెలవైన మేడారంలో ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతోంది.900ఏళ్ల నుండే కోరిక కోర్కెలు తీర్చే తల్లులుగా సమ్మక్క సారలమ్మలు భక్తుల పూజ లందుకుంటున్నా

రు. ఫిబ్రవరి 5వ తేదీన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెపైకి చేరడంతో మహాజాతర ప్రారంభమవ్ఞతుంది. 6వ తేదీన సమ్మక్కను చిలకలగుట్ట నుంచి గద్దెకు ప్రభుత్వ అధికార లాంచనాలతో తోడ్కొని రావడంతో మేడా రంలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమవ్ఞతుంది. ఫిబ్రవరి ఏడున భక్తులు దేవతామూర్తులకు తమ పూజలను సమర్పించుకుంటారు. 8న దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి అధిక ప్రాధాన్యత కల్పిస్తుంది. శాశ్వత ప్రాతిపదికన మేడారం, దాని పరిసర ప్రాంతాలైన రామప్ప, లక్న వరంలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తోంది.

మేడారం జాతర ఏర్పాట్లను ప్రభుత్వం శరవేగంగా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. నాలుగు రోజుల పాటు వైభవంగా కొనసాగే జాతర ద్వారా పర్యావరాణానికి హాని కలగకుండా ప్లాస్టిక్‌ రహిత జాతరగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించి ఆ దిశగా చర్య లు చేపట్టింది. లక్షలాది మంది భక్తులు హాజరుకానున్న జాతరలో ప్లాస్టిక్‌ నిషేధం చేయాలనే నిర్ణయం సాహసోపేతమైంది.

దీనిని సమర్థవంతంగా అమలు చేసేందుకు పక్కా ప్రణాళికతో అధికారులు పనిచేస్తున్నారు. భక్తులు తమ వెంట ప్లాస్టిక్‌ వస్తువ్ఞలను తీసుకొని రాకూడదని ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. బ్యానర్లు, కరపత్రాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరు స్తున్నారు. జాతరకు వెళ్లే మార్గాలలో పలు చోట్ల ప్రత్యేకంగా కేంద్రాలను నెలకొల్పారు.

జాతరకు భక్తులను తరలించేందుకు నాలుగువేల బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఆర్టీసీ ప్రాంగణాలలో భక్తులు ప్లాస్టిక్‌ లేకుండా ప్రయాణం చేయడానికి అవగాహన కల్పిస్తారు. బస్సులు బయలుదేరే ముందు బస్సులలో ప్లాస్టిక్‌ సంబంధిత వస్తువ్ఞలు లేకుండా ఆర్టీసీ సిబ్బంది తనిఖీ చేస్తారు. మేడారానికి బస్సులు బయలుదేరే అన్ని డిపోలలో ఈ పద్ధతిని అమలు చేసి జాతరను ప్లాస్టిక్‌రహితంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నారు.

లక్షల సంఖ్యలో వచ్చే ప్రైవేట్‌ వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి పలు బృందాలను ఏర్పాటు చేశారు. మేడారంలో లైసెన్స్‌లు పొంది వివిధరకాల వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయ వస్తువ్ఞలపై అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే లైసెన్స్‌లు రద్దు చేస్తారు. భారీగా జరిమానాలు విధించాలని ఆదేశించారు. దుకాణ దారులు వస్త్ర, జనుము సంచులు, పేపర్‌ బ్యాగులు, పేపర్‌ ప్లేట్స్‌, పేపర్‌ కప్స్‌, మట్టి, స్టీల్‌ పాత్రలనే అమ్మకాలు చేయను న్నారు.

మేడారం జాతరలో ప్లాస్టిక్‌ సేకరణకు 40 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జాతర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ప్లాస్టిక్‌ వ్యర్థ పదార్థాలను సేకరించి స్క్రాప్‌ సేకరణదారులకు అప్పగించనున్నారు. ప్లాస్టిక్‌ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ములుగు ప్రవేశం గట్టమ్మ దేవాలయం వద్ద ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన బాహుబలి విలన్‌ కాలకేయ (ప్లాస్టిక్‌ భూతం) విగ్రహం భక్తులను ఆకట్టుకుంటున్నది. మేడారం మహా జాతరకు వచ్చే సందర్శకులు ఎవరైనా ప్లాస్టిక్‌ తీసుకొస్తే కాలకేయ ప్లాస్టిక్‌ విగ్రహం వద్ద వదిలి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

జాతరలో ప్లాస్టిక్‌ వస్తువ్ఞల వినియోగాన్ని పూర్తిగా నియంత్రిం చేందుకు జిల్లా అధికార యంత్రాంగం భక్తులను ఆకట్టుకునేలా ఓ పోటీ నిర్వహిస్తోంది. ప్లాస్టిక్‌ ఫ్రీ జాతరపై ఆసక్తి పెంచేందుకు ‘సెలబ్రిటీ దర్శనం పేరుతో ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేస్తు న్నారు. జాతరకు వచ్చే భక్తులు ‘ప్లాస్టిక్‌ వస్తువ్ఞలను జాతరలో వాడట్లేదని, మీరు కూడా వినియోగించవద్దు అని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో పోస్ట్‌ చేయాలి. ఈ పోస్ట్‌లకు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో 500కుపైగా లైక్‌లు కానీ, షేర్‌లు కానీ వస్తే పోస్ట్‌ చేసిన వ్యక్తితో పాటు వారి కుటుంబ సభ్యులకు సెలబ్రిటీ దర్శనం చేయిస్తారు. వీరి ఫొటోలను సైతం జాతరలో ఏర్పాటు చేసే ఎల్‌ఇడి స్క్రీన్‌లపై ప్రదర్శించనున్నారు.

అదేవిధంగా మేడారం జాతర సందర్భంగా మొక్కనాటి సెల్ఫీని పోస్ట్‌ చేసిన వారికి 500లకుపైగా లైక్‌లు కానీ, షేర్‌లు కానీ వస్తే వారికి కూడా సెలబ్రిటీ దర్శనం చేయిస్తారు. లైక్‌లు, షేర్‌లకు సంబం ధించిన స్క్రీన్‌షాట్‌లను మేడారం జాతర అఫీషియల్‌ యాప్‌లో పోస్ట్‌ చేయాలి. మేడారం మహజాతరకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వాన్ని కోరుతోంది. జాతర విశేషాలతో కూడిన అమితాబ్‌ వీడియో ను రాష్ట్రప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.

హిందీ, ఇంగ్లీషు భాషల్లో రెండేళ్లకోసారి జరిగే జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా అభివర్ణిస్తూ జాతర విశేషాలను ఈ వీడియోలో వివరించారు. జాతరకు జాతీయహోదా ఇవ్వా లని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న క్రమంలో బిగ్‌బి వీడియో ప్రాధాన్యత సంతరించుకొంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరవలన మేడారం చుట్టూ 15 కిలో మీటర్ల మేర ప్లాస్టిక్‌ వ్యర్థపదార్థాలు పేరుకుపోతున్నాయి. దీని వలన పర్యావరణానికి, వన్యప్రాణులకు, వ్యవసాయానికి తీవ్రంగా హాని కలుగుతోంది. సారవంతమైన పంట పొలాల్లో ప్లాస్టిక్‌ పదార్థాలు కలిసిపోయి పంటల దిగుబడి తగ్గిపోతోంది.

గత జాతరలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ చెత్త అక్షరాల ఇరవై టన్నులపై మాటేనని కాలుష్యనియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న మేడారం జాతరను ప్లాస్టికరహితంగా జరిపి దేశానికి మంచి సందేశాన్ని అందించాల్సిన బాధ్యత భక్తులందరిపై ఉంది. ప్లాస్టిక్‌రహితంగా జాతర నిర్వహించాలనే ప్రభుత్వ ప్రయత్నానికి అందరూ చేయూత అందించినట్లయితే మేడారం దాని పరిసర ప్రాంతాలను రక్షించిన వారమవ్ఞతాం.

  • బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/