ప్రజావాక్కు: సమస్యలపై గళం

పెరుగుతున్న నకిలీ వెబ్‌సైట్లు:.- సి.హెచ్.సాయిరుత్విక్, నల్గొండ
పిఎఫ్ ఖాతాదారులుగా ఉన్న ఉద్యోగులు ఇటీవలి కాలంలో రకరకాల మోసాలకు గురవ్ఞతున్నారు. ఉద్యోగులు దాచుకున్న ఖాతాల నుండి సొమ్ము వారికి తెలియకుండానే మాయమైపో తున్న ఘటనలు ఇటీవల అనేకం చోటు చేసుకుంటున్నాయి. వీటిని నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పిఎఫ్ ఖాతాదారులకు తెలియచేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున అవ గాహన సదస్సులను ఏర్పాటు చేయాలి. ప్రస్తుత యుఎఎన్ నెంబర్‌ల వలన అనేక ఇబ్బందులు వస్తున్నాయని, పిఎఫ్ ఖాతాల వివరాలు వ్ఞన్న సర్వర్‌లు తరచుగా హ్యకింగ్‌కు గురై సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయన్న వార్తల పట్ల ఖాతాదారులు ఆందోళనకు గురవ్ఞతున్నారు. పిఎఫ్‌కు సంబంధించి టోల్‌ఫ్రీ నెంబర్ తరచుగా మొరాయిస్తోంది. నకిలీ వెచ్‌సైట్ల ద్వారా ఖాతాదారులను మోసం చేసే సంఘ టనలు కూడా విరివిగా జరుగుతున్నాయి
కీచకులను అరికట్టాలి: -కె. అన్నపూర్ణమ్మ, విశాఖపట్నం
మనదేశంలో గురువ్ఞకి, వైద్యునికి అతి ఉత్తమ స్థానం. అంటే దేవ్ఞడితో పోల్చారు. వారిద్దరూ లేనిదే జీవితం లేదు. కనుక గురుసాక్షాత్త పరబ్రహ్మ, వైద్యోనారాయణహరి అని పొగిడారు. కాని ఇప్పుడు మాత్రం గురువ్ఞ కీచకుడు, వైద్యుడు దుర్మార్గు డని అంటున్నారు. పేషంట్లతో అసభ్యంగా ప్రవర్తించాడని, విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని బంధువ్ఞలు, విద్యార్థి తల్లిదండ్రులు దాడులు చేస్తున్నారు. అసలు ఆ వృత్తుల్లో ప్రవే శించడానికే ప్రజలు భయపడుతున్నారు. కనుక ఇలాంటివి మానుకోవాలి. ఏవైనా ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు.
ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి: -సి.ప్రతాప్, శ్రీకాకుళం
కేంద్రప్రభుత్వం వివిధ విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఎక్కువనిధులు కేటాయించాల్సిన అవస రంఉంది. దీనివలన చేకూరే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పాదకతను పెంచినప్పుడు ఖర్చుచేసే ప్రతి రూపాయికి అద నపు ప్రతిఫలంలభిస్తుంది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ దేశాలు ఈబాటలోనే అద్భుత ఫలితాలు సాధిస్తున్నా యి. భారత ప్రభుత్వం ఉత్పాదకతను పెంచే పరిశోధన కార్య క్రమాలకు ఎక్కువ నిధులను కేటాయించడంతోపాటు ఆ దిశగా రాష్ట్రాలను కూడా ఆదేశించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల జీతభత్యాల పెంపుదలను ఉత్పాదకతతో ముడిపెట్టాలి.
\ సంక్షోభంలో విమానయాన రంగం:-ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరుజిల్లా
మనదేశంలో విమానయానరంగంఅనూహ్యంగా అభివృద్ధిపధం లో దూసుకెళ్తున్న వేళ విమానయాన సంస్థలు ధరలను సామా న్యుడికి అందుబాటులోనికి తేవాలని పోటీపడటం హర్షణీయం. కానీ ఈ పరుగులో ఒకప్పుడు మార్కెట్‌లో 22.5 శాతం వాటాతో 195 రోజువారీ సర్వీసులు, 37 గమ్యస్థానాలతో ఒక్క వెలుగు వెలిగిన జెట్ ఎయిర్ వేస్ ప్రస్తుతం ఎనిమిదివేల కోట్ల రుణ ఊబిలో చిక్కుకొని, రుణదాతల చేతికి చిక్కి తీవ్ర మైన కష్టాలను ఎదుర్కొంటోంది. మరొకపక్క 2005 నుండి ప్రారంభమైన స్పైస్‌జెట్ దేశీయ విమానయానంలో 13.6శాతం వాటా కలిగి రెండవ పెద్ద విమానయాన సంస్థగా దూసుకుపో తోంది. జెట్‌ఎయిర్‌వేస్ తాజాగా ఎనిమిదివేల కోట్లరుణభారం తో సంస్థ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుర్భరపరిస్థితిలో చతికిలపడిపోవడం, సంస్థ విధానపరమైన లోపాలను ఎత్తిచూపిస్తోంది.
ట్రంప్ యాత్ర ఫలితం అస్పష్టం:- డా.డి.వి.జి.శంకరరావు, విజయనగరం
అమెరికా అధ్యక్షుడి భారత యాత్ర ఆర్భాటంగా సాగింది. అతిథి మర్యాదలు చూపడంలో భారత్ ఏ లోటూ చేయలేదు. తనకు లభించిన అపూర్వస్వాగతానికి ఉప్పొంగిపోయినట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. భారత ప్రధాని మోడీ పట్ల, దేశంపట్ల తమగౌరవాన్ని,స్నేహభావాన్ని ఆయన దాచుకోలేదు. అమెరికా, భారత్ మైత్రి ప్రభుత్వాలకు అతీతమైనదిగా, ప్రజల మధ్యనున్న పవిత్రబంధంగా చాటిచెప్పారు. ఒక స్నేహాన్ని కొనసాగించే ఇరుదేశాల ప్రయత్నంగా చూస్తే, ఉద్వేగపరంగా లెక్కలేస్తే ఈయాత్రాసందర్భంచారిత్రాత్మకం.అదే స్నేహబంధం బలపడడం వల్ల కలిగిన లాభనష్టాల కోణంలో చూస్తే మాత్రం ఫలితం అస్పష్టం.
మద్యాన్ని పూర్తిగా నిషేధించాలి: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం
ఆంధ్రప్రదేశ్‌లో దశలవారీగా మద్యనిషేధం అమలుకై ప్రణాళిక లు సిద్ధం చేస్తుండగా క్షేత్రస్థాయిలో పలు సవాళ్లు ఎదుర్కోవా ల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మద్యం దుకాణాలు, బార్లు 20 శాతం, మద్యం ధరయాభై శాతం పెంచి అంచెలంచెలుగా పూర్తి అమలుకు ప్రయత్నిస్తుండగా బ్రాండెడ్ మద్యం బదులు నకిలీ సరుకు సరఫరా చేస్తున్నందున తాగినా కిక్కులేక కూలి నాలీ చేసుకునేవాళ్లు నాటుసారా,డబ్బున్నోళ్లు ఇతర ప్రాంతాలకువెళ్లి వారివ్యసనాన్ని తీర్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సంపూర్ణ మద్యనిషేధం అమలుకు అవరోధాలు కనబడుతున్నాయి.
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com/