ప్రజావాక్కు

సమస్యలపై ప్రజా గళం

Voice-ot-the-people
Voice-of -the-people

వలంటీర్లపై ఆధారపడటం సరికాదు!-కంభంపాటి కోటేశ్వరరావు, మురళీనగర్‌, విశాఖపట్నం

రాష్ట్రంలోకి ఇతర దేశాల నుండి వచ్చిన వారి సమాచారం వలంటీర్లు సేకరించి ప్రభుత్వానికి అందచేయాలన్న పద్ధతి సరికాదు. పోలీసు యంత్రాంగం వివిధ విమానాశ్రయాల అధికారులనుండి ప్రయాణీకుల వివరాలను రాబట్టి క్రోడీకరిం చుకోవచ్చు.

అసలు వలంటీర్ల వ్యవస్థే లోపభూయిష్టం. వారికి సరైన శిక్షణ, వివిధ అంశాలపై సరైన అవగాహన మృగ్యం. వారు సేకరించి పంపే సమాచారం విశ్వసనీయత ఎంత? ఇప్పటికే ప్రభుత్వం రోజుకో సంఖ్య చెబుతూ ప్రజల్లో విశ్వా సం కోల్పోతున్నది.పైగా వలంటీర్లు అద్భుతంగా పనిచేస్తున్నా రంటూ పాలకులు అసత్య ప్రచారానికి దిగటం హాస్యాస్పదం గా ఉంది.

వాస్తవానికి క్షేత్రస్థాయిలో చాలా మంది వలంటీర్లు అనేక కారణాలతో విధులు నిర్వర్తించడం లేదు. ప్రభుత్వం లేనిపోని బేషజాలకుపోకుండా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూ అభాసుపాలవుతున్నారు.

వదంతులను నమ్మకూడదు: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

కరోనా వైరస్‌ గురించి ప్రజలకు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. అదే వదంతులను సోషల్‌ మీడియా ద్వారా ప్రజ లకు చేరి ప్రజలు భయభ్రాంతులకు గురవ్ఞతున్నారు.

ప్రస్తుత తరుణంలో ప్రజలు ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా ఉండవలసిన అవసరం చాలా ఉంది. పోలీసుశాఖ వారు కరోనా వైరస్‌ గురించి వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై నిఘా ఉంచాలి. ప్రజలు కూడా వదంతులను నమ్మకుండా, అందులో ఎంత వరకు నిజం ఉన్నదో తెలుసుకోవాలి.

రేషన్‌ సరకులు ఇంటివద్దకే: -గరిమెళ్ల భారతీదేవి, ఏలూరు, ప.గో.జిల్లా

కరోనా వైరస్‌ ఉధృతి, ఆంక్షల నేపథ్యంలో రేషన్‌ సరుకులను దుకాణాల వద్ద ఇవ్వటం సరికాదు. వలంటీర్ల ద్వారా ఆయా వినియోగదారులకు ఇళ్లవద్ద అందచేయడం శ్రేయస్కరం. అధికార యంత్రాంగం ఈ మేరకు చర్యలు వెంటనే తీసుకో వాలి. అ

లాగే గ్రామాల్లో, పట్టణాల్లో సంచార నిత్యావసర వస్తువ్ఞల విక్రయ విహనాల ద్వారా అవసరమైన వారికి నిత్యావసర వస్తువ్ఞలను సరసమైన ధరలకు అందచేయాలి. ఇందువలన ప్రజలు ఇళ్లనుండి బయటకు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది.

కరోనా ప్రభావం లేని పాకిస్థాన్‌: -కనుమ ఎల్లారెడ్డి, కర్నూలు

ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం చైనా. అభివృద్ధి చెందిన దేశం కూడా. తూర్పు ఆసియాలో పెద్దదేశం. దక్షిణ ఆసియాలో భారత్‌ పెద్ద దేశం. నేడు దేశదేశాలను విభ్రాంతికి గురి చేస్తున్న కరోనావైరస్‌,దానిబారినపడిన దేశాలు అతలాకు తలమై తీవ్రమైన ఆర్థిక దుస్థితిని ఎదుర్కొంటున్నాయి

. ఐరోపా దేశాలు కూడా ఈ మహమారి కరోనా బారినపడటం విస్మయం కలిగిస్తోంది. అభివృద్ధిచెందిన దేశాలపైనా దీని ప్రభావం మిక్కు టంగా ఉంది.

. అంటే దీనికి ముందే పాక్‌ సిద్ధపడిందా?ఎవరు ఎన్ని చెప్పినా చైనాకు పాక్‌ అత్యంత మిత్ర దేశం. లోగట్టుగా ఎన్నో ఒప్పందా లు జరుగుతున్నాయో ఎన్నో వాణిజ్య, ఆరోగ్య ఒప్పందాలు జరుగుతున్నాయో నిగూఢంగా చూస్తే కానీ తెలియదు.

పన్నురాయితీలలో కోత: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులు ఆదాయపు పన్నులకు రాయితీలు లభిస్తాయని ఆశించి ఆశాభంగం చెందారు. ఎలాంటి మినహాయింపులు లభించకపోగా 88 సెక్షన్‌ నుండి ఇప్పటి వరకు లభించే ఆదాయపు పన్ను రాయితీలో కూడా భారీగా కోతలు పడ్డాయి.

గ్రాట్యూటీ పరిమితి పెంచుతామన్న వాగ్దానం అమలుకు నోచుకోలేదు. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వచ్చే వడ్డీలో కోతలు పడినందున ఉద్యోగస్తులకు పొదుపుచేసే అలవాటు తగ్గుతుంది. గృహరుణాలపై లభించే వడ్డీ రాయి తీలను తగ్గించడం వలన గృహరుణాలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది

. ఒకవైపు కార్పొరేట్‌ సంస్థలకు భారీ గా పన్ను పన్నురాయితీలు ఇస్తున్న ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల వివక్షత ప్రదర్శించడం సబబుగా లేదు.

వరకట్నాన్ని రూపుమాపుదాం: -బి.ఎన్‌.సత్యనారాయణ,హైదరాబాద్‌

వివాహాలు జరుపుకుంటున్న సందరాళీలలో ధనం, ఆహార పదార్థాలు, వృధా కాకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం వివాహానికి కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలనే నిబంధనను తీసుకువచ్చింది.

అయితే దానిని ఎవ్వరూ అనుసరిస్తున్న దాఖలాలే కానరావడం లేదు. కేవలం అయిదు వందల రూపాయల ఖర్చుతో రిజిస్టర్‌ వివాహాలను ఆదర్శంగాతీసుకోవాలి. అంతేకాకుండా సమాజాన్ని పట్టిపీడిస్తు న్న వరకట్నం దురాచారాన్ని రూపుమాపాలి.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/