ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్‌ వ్యూహం

మంచి ఇంప్రెషన్‌ కోసం కొన్ని సూచనలు

Communication strategy
Communication strategy

జాబ్‌ ఎంపిక ఎప్పటికి నరాలకు ఉత్కంఠ కలిగించే అనుభవమే. జాబ్‌ కోసం ప్రయత్నం అంటేనే ఒత్తిడికి లోనవడం. ఈ నెర్వస్‌నెస్‌ను అధిగమించడమే అభ్యర్థి చేయాల్సిన తొలి పని అన్నది హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజర్లలో అత్యధికుల అభిప్రాయం. ఇంటర్వ్యూను సమర్ధంగా ఎదుర్కొనేందుకు మెలకువలు అవసరం అని సంబంధిత నిపుణులు సూచిస్తున్నారు. సరికొత్త పోకడలను కూడా దృష్టిలో పెట్టుకుని చేసిన సూచనలు ఇవి

ఇంటర్వ్యూ అంటేనే అభ్యర్థి సామార్థ్యాలను గుర్తించే పని అంటున్నారు. ఒకవేళ ఇంటర్వ్యూ గంట సేపు జరిగితే ఆ సమయంలో అడిగే ప్రశ్నలు అన్నింటికి సమగ్రంగా సమాధానం ఇవ్వడం అన్నది ఏ అభ్యర్ధికి సాధ్యం కాదు. అందువల్ల నాన్‌ వెర్బల్‌ కమ్యూనికేషన్‌ సామర్ధ్యాన్ని తగ్గించి చూడవద్దు. అంటే కమ్యూనికేషన్‌ సంబంధిత వ్యూహం చాలా పకడ్బందీగా ఉండాలి. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఏమి అడుగుతున్నారు. మనం ఏమి చెబుతున్నాం. సమాధానాన్ని మనం ఎలావ్యక్తం చేస్తున్నాం. ఏమి చేయాలి అనే విషయాలపై పక్కా ప్రణాళికతో వ్యవహరించాలి.

మన పరోక్షంలో మనల్ని కంపెనీ ముందు నిలిపేదేసివి, మొదట ఆ రెజ్యూమ్‌ (కరికులం విటా§్‌ు) ఆకట్టుకుంటేనే హైరింగ్‌ మేనేజర్‌ నుంచి పిలుపు అందుకోగలం. అందువల్ల దేనికదిగా కంపెనీని అనుసరించి సివిని రూపొందించుకోవాలి. చిట్టిపొట్టి వాక్యాలతో ఇంత వరకు చేసిన పని తదితరాలన్నీ రాయాలి. సొంత విషయాలు మొదలుకుని ప్రతీది బుల్లెట్‌ పాయింట్స్‌తో రాయాలి. అబద్ధాలకు తావుండరాదు. ఆకట్టుకునే రీతిలో చక్కటి రెజ్యూమ్‌ రూపొందించుకోవాలి. కరెక్ట్‌ ఫాంట్‌ ఉపయోగించాలి.

ఇటీవలి క్వాలిఫికేషన్‌తో మొదలు పెట్టి టెన్త్‌ వరకు అర్హతల దగ్గర రాయాలి. పాసైన సంవత్సరం, పొందిన మార్కులు లేదా శాతం, యూని వర్సిటీ/బోర్డు వివరాలు ఉండాలి. సినిమాలు, టెలివిజన్‌ వీక్షణ మీకు ఇష్ట్టమైనప్పటికీ వాటిని హాబీలుగా పేర్కొనకూడదు. వాటికి బదులు పుస్తకాలు లేదంటే దినపప్రతికలను క్రమం తప్పకుండా చదవ డం హాబీగా పేర్కొనవచ్చు.

అలాగే వ్యక్తిగత కాంటాక్ట్‌ సమాచారాన్ని అప్‌డేట్‌ చేయాలి. రెజ్యూమ్‌ రాయడంలో కొందరు ప్రొఫెషనల్స్‌ ఉంటారు. వారి సహాయం కూడా తీసుకోవచ్చు. ఇంటర్వ్యూలో గెలుపు అన్న విషయాన్ని పక్కన పెడితే అభ్యర్ధిగా మంచి ఇంప్రెషన్‌ ఇవ్వగలగాలి. సమయానికి ఇంటర్వ్యూ చేసే ప్రదేశానికి చేరుకోవడం, మంచి డ్రెస్సింగ్‌, ఐ కాంటాక్ట్‌ చేప్పే విషయంలో స్పష్టత, ఆత్మవిశ్వాసం, గతంలో సాధించిన విజయాల వివరణలో అచితూచి వ్యవహరించాలి.

యావత్తు వ్యవహారాన్ని నేర్పుగా పదబందంలో ఇముడ్చుకోవాలి. ఇదో కీలకఅంశం మీ నుంచి ఏమి ఆశిస్తొందో కంపెనీ నర్మగర్భంగా తెలియ జేస్తుంది. ఆ మాటల్లోని అంతరార్ధాన్ని అర్ధం చేసుకోండి.

తుది ఎంపికకు సంబంధించి మర్యాదగా ప్రశ్నించి తెలుసుకోండి ఇంటర్వ్యూ అనంతరం ఫాలో ఆప్‌ను అస్సలు మర్చిపోవద్దు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/