ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలు

వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న వాహనం కొడంగల్ శివారులోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/