ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్‌ ..గవర్నర్‌ ప్రసంగం

తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళుతుంది

tamilisai soundararajan
tamilisai soundararajan

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ, శాసన మండలి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలిసారి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ‘సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళుతుంది. ఆరు దశాబ్దాల పోరాటం తరువాత ప్రత్యేక రాష్ట్ర సాధ్యమైంది’ అని తెలిపారు. ‘స్వల్ప కాలంలోనే తెలంగాణ చాలా రంగాల్లో అగ్రగామిగా తయారైంది. అన్ని రంగాల్లోనూ రాష్ట్ర గణనీయమైన అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతోంది. తెలంగాణ ఏర్పడిన తొలి నాళ్లలో రాష్ట్రంలో కరెంట్ కొరత అధికంగా ఉండేది. కానీ, ఇప్పుడు ప్రజలకు ఆ బాధలు లేవు’ అని తమిళిసై చెప్పారు. కాగా ‘అప్పట్లో రైతుల ఆత్మహత్యలు, వలసలు ఉండేవి. విద్యుత్‌, నీళ్లు, ఎరువుల పరంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ఇప్పుడు ప్రజలకు ఈ కష్టాలు ఎదురు కావట్లేవు. తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు రూ.2 వేల పింఛను ఇస్తున్నారు. ఒంటరి మహిళలకు కూడా నా ప్రభుత్వం పింఛను ఇస్తోంది. కెసిఆర్‌ కృషితో తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తోంది’ అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/