జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి. మనం మంచిగానే వాహనం నడుపుతున్నా, ఇతరులు ఏ విధంగా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నారో చెప్పలేం. ఎంత జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేస్తున్నా, కొన్ని సార్లు ఇతరులు చేసిన తప్పిదాలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

తాజాగా జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోరుట్ల మండలం వెంకటాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పొయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులు కొండగట్టు నుంచి మెట్‌పల్లికి వెళ్తున్న కూలీలుగా పోలీసులు గుర్తించారు.