ఈరోజు ఉదయం కోణార్క్ ఎక్స్ ప్రెస్ కింద పడి రాజు ఆత్మ హత్య

సైదాబాద్ సింగరేణి కాలనీ లో చైత్ర అనే ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి , చంపేసిన నిందితుడు రాజు..ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ ఘనపూర్ రైల్వే ట్రాక్ ఫై అతడి డెడ్ బాడీ లభ్యమైంది. ఈరోజు ఉదయం హైదరాబాద్ కు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ కింద పడి రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు సాక్షాలు చెపుతున్నారు. ఉదయం 08 : 45 కు ఈ ఘటన చోటు చేసుకుందని చెపుతున్నారు. ముందుగా రాజు చెట్ల పొదల్లో దాక్కున్నాడు. ఆ తర్వాత కోణార్క్ ట్రైన్ కు ఎదురుగా వెళ్తుండడం తో ఆత్మ హత్య చేసుకుంటున్నాడని భావించాం..భావించినట్లే అతడు ఆత్మ హత్య చేసుకున్నాడని రైల్వే సిబ్బంది చెపుతున్నారు.

రాజుచేతిపై మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా నిందితుడు రాజుగా పోలీసులు గుర్తించారు. గత వారం రోజులుగా దాదాపు 1000 మంది పోలీసులు రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక పోలీసు బృందాలు పూర్తి వివరాలు సేకరించేందుకు స్టేషన్ ఘనపూర్ కు వెళ్తున్నారు. మరోపక్క సింగరేణి కాలనీ వాసులు. చిన్నారి తండ్రి మాత్రం రాజు డెడ్ బాడీ ని మాకు చూపించాలని..చూపిస్తే మాకు అతడు రాజునో కాదో తేల్చి చెపుతామని అంటున్నారు.