‘జూమ్ తీర్మానాలు పెట్టి ఏం పీకుతావ్ బాబూ?’

వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్

VijayaSai Reddy- Chandrababu
VijayaSai Reddy- Chandrababu

Amaravati: తెదేపా మహానాడు కార్యక్రమం వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కనుమరుగయిందని అన్నారు. చంద్రబాబు జయప్రదంగా కొట్టేసిన పార్టీ ఫినిష్ అయిపోయిందన్నారు. అరెస్టులను ఖండించడం, బెయిళ్లు, స్టేలు సంపాదించడానికే టీడీపీ పరిమితమయిందని వ్యాఖ్యానించారు. కుప్పంలోనే టీడీపీ కొట్టుకుపోయిన తర్వాత… అచ్చెన్న మాటలు నిజం కాకుండా ఎలా పోతాయని పేర్కొన్నారు. టీడీపీకి ఇప్పుడు జూమ్ మహానాడులే మిగిలాయని విమర్శించారు.

‘’జూమ్ మీటింగ్ అనగానే వాలిపోయే పచ్చ నేతలు ఒక్కరూ నియోజకవర్గాల్లో కనిపించరు. ప్రజలను గాలికొదిలేశారు సరే పరామర్శల కోసం విశాఖ వచ్చిన లోకేశంనూ పట్టించుకోలేదు. అద్దె మైకులతో రెచ్చిపోయే అచ్చన్న, అయ్యన్న, కూన, గంటా ఏమైపోయారు? లోకేశం అంటే అచ్చన్నకున్న అభిప్రాయమే అందరిదా?. ఏ పార్టీ అయినా ఓడిపోయాక ఆత్మపరిశీలన చేసుకుంటుంది.

టీడీపీ మాత్రం పరనిందకే పరిమితమైంది. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతావ్ బాబూ? కుప్పంలో ఎందుకు ఖంగుతిన్నావో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ఎందుకు దొరకలేదో ఆ జూమ్ నాడులో ఏడవండి. ఇంకెంతకాలం ఈ ఆత్మవంచన?‘’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/