20 మందితో టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా

ఎన్నికల సంఘానికి జాబితాను అందించిన టీఆర్ఎస్

హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో 20 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను టీఆర్ఎస్ సిద్ధం చేసింది. ఈ జాబితాను ఎన్నికల సంఘానికి అందించింది.

టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సుంకె రవి శంకర్, చల్లా ధర్మారెడ్డి, సతీశ్ కుమార్, ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, సండ్ర వెంకట వీరయ్య, దాసరి మనోహర్ రెడ్డి, ఇనుగుల పెద్దిరెడ్డి, కరీంనగర్ జడ్పీ ఛైర్మన్ విజయ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/