ప్రమాద స్థలికి వచ్చిన ముగ్గురుని కబళించిన మృత్యువు

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన

Road Accident
Road Accident

Dachepalli : శుక్రవారం పొద్దున్నే గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వివరాలు ఇలా వున్నాయి. దాచేపల్లి మండలం గామాలపాడు గణపతి కోల్డ్ స్టోరేజ్ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటన చూసేందుకు బైకుపై అక్కడకు చేరుకున్న నలుగురిని అటుగా వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. మృతులందరూ గామాలపాడు వాసులుగా పోలీసులు గుర్తించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/