‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్‌పై యండమూరి సెటైర్లు

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కలయికలో తెరకెక్కిన మూవీ వాల్తేర్ వీరయ్య. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటీకే దేవి శ్రీ అందించిన సాంగ్స్ శ్రోతలను , అభిమానులు తెగ ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా విడుదలైన టైటిల్ సాంగ్ మరోలెవల్లో ఉంది. ఈ పాట లిరిక్స్‌పై ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సెటైర్లు వేయడం మెగా అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తుంది.

‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్‌ లిరిక్స్ విషయానికొస్తే.. ‘తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడే వీడే… తిమిరనేత్రమై ఆవరించిన త్రినేత్రుడే!’. ఇవే పదాలను కోట్ చేసిన కవి వూటుకూరు జానకిరామారావు ‘రాసినవారు ఎవరో కానీ అసలు అతడెందుకు రాశాడు, అతనికి ఏ సంప్రదాయం తెలుసు? ఏ పురాణకథలు చదివాడు?’ అని ప్రశ్నించాడు. అసలు తిమిరము అంటే అర్థం తెలుసా.. త్రినేత్రుడు అనగా శివమహాదేవుడు ! ఆయన తిమిరనేత్రము అనగా చీకటి కన్నుగా కలిగినవాడు లేదా రోగమున్న కన్నుకలవాడు ! ఏ అర్థం తీసుకున్నా అది శివదూషణే!’ అని విశ్లేషిస్తూ ఏ తుఫాను అంచున వశిష్ట మహర్షి తపస్సు చేశారో చెప్పు నాయనా? అంటూనే ఏమిటీ పిచ్చిరాతలు? అంటూ సెటైర్లు వేశాడు.

అయితే పై పోస్టును ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన యండమూరి.. ఇది తనకు కూడా అర్థంకాక ఇద్దరు ముగ్గురు పండితులను అడిగానని, అయినా సమాధానం దొరకలేదన్నాడు. అయితే ఒక మిత్రుడు మాత్రం ‘సరైన పదాలు పడలేదు కానీ, బీడీ తాగే హీరో.. తుఫాను అంచున తపస్సు చేసే, అంటే ఎంత కల్లోల పరిస్థితుల్లో అయినా, శాంతంగా వశిష్ఠుడిలా తపస్సు చేస్తాడు. మూడో కన్ను లేని, శివుడనీ అనుకోవచ్చు’ అన్నారని చెప్పుకొచ్చాడు. చివరకు మహా కవులు వేటూరి, సీ నారాయణ రెడ్డి ప్రస్తావన తెచ్చి నో కామెంట్స్ అంటూ ముగించాడు.

ఇక ఈ పాటపై చర్చ రసవత్తరంగా కొనసాగుతోంది. ‘చిరంజీవితో డైరక్ట్‌‌గా మాట్లాడేంత చనువున్న మనిషి కదా మీరు. ఇలా పబ్లిక్‌లోకి లాగకపోతే ఆయనతోనే మాట్లాడి తప్పు సరిచేయించ లేకపోయారా సర్’ అని ఒక యూజర్ యండమూరికి సూచించారు. అయితే రచయిత వెర్షన్ ఏంటో.. ఒకవేళ నాదే తప్పుకావచ్చునేమో అని బదులిచ్చారు యండమూరి. మరి దీనిపై సాంగ్ రాసిన రచయిత ఏమైనా స్పందిస్తారో చూడాలి.

YouTube video