టీడీపీ నేత పట్టాభి కామెంట్స్ వర్మ కౌంటర్

సంచలన డైరెక్టర్ , వివాదాలకు కేరాఫ్ రామ్ గోపాల్ వర్మ..రీసెంట్ గా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన సంగతి తెలిసిందే. కలిసిన నెక్స్ట్ డే నే వ్యూహం అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతే కాదు వరుసపెట్టి రాజకీయ పార్టీల ఫై ట్వీట్స్ చేసాడు. దీంతో వర్మ ఫై పలు పార్టీల నేతలు కామెంట్స్ వేస్తూ వస్తున్నారు. టీడీపీ పార్టీ నేత పట్టాభి సైతం వర్మ ఫై పలు కామెంట్స్ చేసారు. వర్మ ఓ ప్లాప్ డైరెక్టర్ అని , ప్లాప్ డైరెక్టర్ తో ఏపీ సీఎం జగన్ మూవీ తీయించి ఓట్లు రాబట్టుకునే పరిస్థితి వచ్చాడని , వర్మ గురించి మాట్లాడడం వెస్ట్ అని ఇలా పలు కామెంట్స్ చేసారు పట్టాభి.

పట్టాభి చేసిన కామెంట్స్ కు వర్మ కౌంటర్ ఇచ్చారు. గుమ్మడికాయ దొంగ అంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. తాను సీఎం జగన్ ను ఎందుకు కలిశానో ఏమి తెలియకుండా పట్టాభి అనే టీడీపీ నాయకుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. రసుగుల్లా స్వీట్ లా ఉండే పట్టాభి మిరపకాయలా ఫీల్ అయ్యి ఎలా పడితే అలా మాట్లాడి హైరానా పడితే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయని, కొద్దిగా కూల్ గా ఉండాలంటూ హితవు పలికారు. పట్టాభికి సలహా ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని, అయితే ప్రజలకు పట్టాభితో ఎటువంటి అవసరం లేదని, వారి కుటుంబ సభ్యులకు ఉంటే ఉండొచ్చని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఇదే సందర్భంలో రసుగుల్లా స్వీటు అంటే తనకు ఇష్టమని, ఆ స్వీటు లా ఉండే పట్టాభి తనకు నచ్చాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.