మంత్రి ‘పువ్వాడ’ పై రేవంత్ రెడ్డి ఫైర్

minister-puvvada

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..ఖమ్మం పర్యటన లో పువ్వాడ అజయ్ ఫై నిప్పులు చెరిగారు. వచ్చే నెలలో రేవంత్ పర్యటన నేపథ్యంలో రేవంత్ రెడ్డి జిల్లాల నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. నిన్న కరీంనగర్ జిల్లాలో నేతలతో సమావేశమైన రేవంత్..ఈరోజు మంగళవారం ఖమ్మం జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో తెరాస మంత్రి పువ్వాడ అజయ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

పువ్వాడ అజయ్ అనే బేకార్ గాడు మంత్రిగా ఉన్నాడని… కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులపై అక్రమ కేసులు, పీడీ యాక్ట్ లు పెట్టించిన సైకో మంత్రి పువ్వాడ అజయ్ అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యాడు. వచ్చే ఎన్నికల్లో వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని పిలుపునిచ్చారు. పువ్వాడకు భయపడాల్సి పని లేదని.. కాంగ్రెస్ పార్టీతో కార్యకర్తలతో పెట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరించారు. తన తండ్రి కమ్యూనిస్ట్ భావజాలంతోని కులాలకు అతీతంగా మనుషులు మనుషులుగా ఉండాలని చెప్పాడని చెప్పుకుంటున్న పువ్వాడ అజయ్.. ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. కమ్మ కులాన్ని అడ్డుపెట్టుకుని బతకాలని చూస్తున్న నీచుడు పువ్వాడ అజయ్ అని విమర్శించారు.

ఇదిలా ఉంటె రేవంత్ ప్రెస్ మీట్ లోకి గందరగోళం చోటుచేసుకుంది. కార్యకర్తలు ఒక్కసారిగా ఆఫీస్ లోకి దూసుకొచ్చారు. కార్యకర్తల మధ్య గొడవలో డీసీసీ ఆఫీస్ లో అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ప్రెస్ మీట్ ప్రాంగంణం నుంచి రేవంత్, భట్టి విక్రమార్క వెళ్లిపోయారు. కార్యకర్తల అత్యుత్సాహంతోనే ఇలా జరిగిందని నేతలంటున్నారు.