ఛత్ పూజకు ప్రసాదం చేస్తుండగా పేలిన సిలిండర్‌.. 30 మందికి గాయాలు

పాట్నాః బీహార్ లో ఛత్ పూజ కోసం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి 30మంది ఆస్పత్రి పాలయ్యారు. బీహార్‌లోని ఔరంగాబాద్‌లోని ఒడియా గాలీలో ఉన్న ఓ ఇంట్లో ఛత్ పూజ సందర్భంగా ప్రసాదాలు తయారు చేస్తున్నది. అయితే గ్యాస్‌ లీకవడంతో సిలిండర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఇంట్లో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి రెండో అంతస్తుకు కూడా వ్యాపించడంతో మంటలు భారీగా చెలరేగాయి.

ఈ ప్రమాదంలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇంట్లో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చే క్రమంలో ఏడుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను సమీపంలోని దవాఖానకు తరలించారు. కాగా, భారీ శబ్ధంతో పేలుడు సంభవించిందని స్థానికులు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/