రేవంత్ కీలక నిర్ణయం..మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రతా తొలగింపు

తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి..తనదైన మార్క్ చూపిస్తూ ..కీలక నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకోగా..తాజాగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రతాను తొలగించాలని పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు పోలీసు శాఖ గన్ మెన్స్‌ను విత్ డ్రా చేసింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పోలీస్ శాఖ గన్‌మెన్లను కేటాయించింది.