రాబోయే ఎన్నికల్లో బిజెపి 400 సీట్లు సాదిస్తుందని జీవీఎల్ జోస్యం ..

రాబోయే ఎన్నికల్లో బిజెపి 400 సీట్లు సాదిస్తుందని జీవీఎల్ నరసింహారావు జోస్యం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం లేని కారణంగా రాష్ట్రం వెనుకబడిందని.. అభివృద్ధి కోసం ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం చాలా ఉందని అన్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 5,000కు పైగా సమావేశాలు నిర్వహిస్తామని జీవీఎల్ తెలిపారు.
బీజేపీని విస్తరించే కార్యాచరణలో భాగంగా గతంలో గెలవని 144 స్థానాల్లో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు వివరించారు. ఆ జాబితాలో విశాఖపట్నం కూడా ఉందని.. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని అన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉందని.. టిడిపిపై కూడా జనంలో ఏమంత సానుకూలత లేదని అభిప్రాయపడ్డారు. వైస్సార్సీపీ ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడే ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేన కూటమిది మాత్రమే అన్నారు.