నేడు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరనున్న రేవంత్ రెడ్డి

వివిధ కారణాల వల్ల నిన్నటి ఢిల్లీ పర్యటన రద్దు

cm-revanth-reddy

హైదరాబాద్‌ః తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన బయలుదేరనున్నారు. తెలంగాణకు నిధులు, ఇతర కేటాయింపుల కోసం ప్రధాని మోదీ, ఇతర కేంద్రమంత్రులను కలవడానికి… అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసేందుకు రేవంత్ రెడ్డి ఈ నెల రోజుల్లో పలుమార్లు ఢిల్లీ బాట పట్టారు. ఈ రోజు మరోసారి ఢిల్లీ వెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్ సభ నియోజకవర్గాల ఇంచార్జీల సమావేశానికి రేవంత్ రెడ్డి నిన్ననే ఢిల్లీ వెళ్లాల్సి ఉండింది. వివిధ కారణాల వల్ల ఆ పర్యటన రద్దయింది. రేవంత్ రెడ్డి స్వయంగా రెండు లోక్ సభ నియోజకవర్గాలకు ఇంచార్జీగా ఉన్నారు.