ఎంపీ అరవింద్ తల్లిని పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

నిజామాబాద్ బిజెపి ఎంపీ అరవింద్ ను , ఆయన తల్లిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితఫై అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేసారని , శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ లోని అరవింద్ ఇంట్లోకి చొరబడ్డ టిఆర్ఎస్ కార్య కర్తలు ఇంట్లోని ఫర్నిచర్ ధ్వసం చేసి , నానా బీబత్సం చేసారు. ఆ సమయంలో అరవింద్ ఇంట్లో లేరు. ఆయన తల్లి తో పాటు పలువురు మహిళలు ఉన్నారు. కాగా ఈ ఘటన ఫై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటె కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎంపీ అర్వింద్ ఇంటిని ఆయన పరిశీలించారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై అర్వింద్ కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబపాలనను పాతరేసే రోజులొచ్చాయని అన్నారు. అధికారం ప్రజలిస్తారు..ఇతర పార్టీల వారు కాదని వ్యాఖ్యానించారు. కవితను చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇతర పార్టీల్లో ఉన్నవారిని తన పార్టీలో చేర్చుకునే మొదటి వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు.

మరోపక్క టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని తెలిపారు. సెక్యూరిటీ గార్డ్, ఇంటి పనిమనిషిపై దాడి చేసినట్లు వివరించారు. కారు, ఇంట్లో ఫర్నిచర్, పూలకుండీలు, దేవుడి ఫొటోలు ధ్వంసం చేసినట్లు పిర్యాదు లో పేర్కొన్నారు.