వైఎస్ వివేకా జయంతి.. నివాళులర్పించిన సునీత, రాజశేఖర్ రెడ్డి

పులివెందులతో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించిన సునీత

ys-sunitha-pays-tributes-to-her-father-vivekananda-reddy-on-his-birthday

అమరావతిః నేడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 72వ జయంతి. పులివెందులలో ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేకా కూతురు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. వివేకా సమాధి వద్ద వీరు నివాళి అర్పించారు. ప్రత్యేక ప్రార్థనలను చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, తన తండ్రి హత్య కేసులో విచారణ కొనసాగుతోందని, సీబీఐ అధికారులు వారి పని వారు చేస్తున్నారని చెప్పారు. తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. ఇంతకు మించి కేసు గురించి తాను మాట్లాడలేనని చెప్పారు. తన తండ్రి బతికి ఉంటే పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేవారమని చెప్పారు.