రేవంత్ ను ‘రెడ్డి’ వారు దూరం పెడుతున్నారా..?

మొన్నటి వరకు ఓ లెక్క ఇప్పుడు ఓ లెక్క అన్నట్లు ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేపట్టడం..అధికారంలోకి రావడం తో తెలుగుదేశం , కాంగ్రెస్ పార్టీల హావ పూర్తిగా తగ్గిపోయింది. తెలుగుదేశం పార్టీ ని ఎప్పుడో మరచిపోయిన ఓటర్లు…కాంగ్రెస్ పార్టీ ని మాత్రం పూర్తిగా మరచిపోలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ లో సరైన నేతలు లేకపోవడం తో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కి కార్య కర్తలు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే రేవంత్..కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొన్నాడో..టి‌పి‌సి‌సి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడో అప్పటి నుండి కార్య కర్తల్లో కొత్త ఉత్సహం మొదలైంది. తన పోరాటాలతో పార్టీని ఇంకా బలోపేతం చేస్తున్నారు.

రాష్ట్రంలో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకరావాలని రేవంత్ గట్టిగానే కష్టపడుతున్నారు.కానీ రేవంత్‌కు మిగిలిన నేతల సహకారం పూర్తి స్థాయిలో అందడం లేదు. కొందరు నేతలు రేవంత్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. కాకపోతే ఇక్కడ మిగిలిన వర్గాలు నేతలు రేవంత్‌ వెనుక నిల్చుని సహకరిస్తున్నారు కానీ..రేవంత్ సొంత సామాజికవర్గమైన రెడ్డి నేతలు మాత్రం పెద్దగా సపోర్ట్ ఇవ్వకపోవడం కాస్త ఇబ్బందిగా మారింది. మల్లు రవి, షబ్బీర్ ఆలి, దామోదర రాజనర్సింహ, మధు యాష్కి, సీతక్క లాంటి వారు రేవంత్‌కు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే భట్టి విక్రమార్క సైతం రేవంత్‌కు అండగా ఉంటున్నారు. కానీ జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, దామోదర్ రెడ్డి లాంటి వారు రేవంత్‌కు ఏ మాత్రం సహకారం ఇవ్వడం లేదు. పైగా ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. అయితే సొంత వర్గం నేతలే ఇలా చేయడం వల్ల రేవంత్‌కు కాస్త ఇబ్బంది గా మారుతుందని కార్య కర్తలు మాట్లాడుకుంటున్నారు.