ఎన్నికలు ఎప్పుడు జరిగిన బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం – ఈటెల

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగిన బిజెపి అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేసారు హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. బిజెపి జాతీయ కార్యనిర్వహణ సమావేశాలు ముగిసాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో అనేక విషయాలను చర్చించారు. ఈ తరుణంలో రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని జేపీ నడ్డా సూచించినట్లు ఈటెల చెప్పుకొచ్చారు.

సికింద్రాబాద్ లో జరిగిన ప్రజా సంకల్ప సభ గ్రాండ్ గా సక్సెస్ అయ్యిందన్నారు. బీజేపీ సమావేశాల సమయంలో ప్రజల సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు ఏర్పాటు చేసుకుని వెకిలీ ఆనందం పొందుతుందన్నారు. బోనాలకు వచ్చినంత జనాలు రాలేదని రాష్ట్ర మంత్రులు మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. అసలు పార్టీ మీటింగ్ ని బోనాలతో పోల్చడం ఏంటని ఆయన నిలదీశారు. మరోసారి అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని..ఈ సారి రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఈటెల దీమా వ్యక్తం చేశారు.

మరోపక్క టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు మాత్రం సభ ఫై అసహనం వ్యక్తం చేసారు. విజయ సంకల్ప సభను ఉద్దేశించి మాట్లాడిన హరీష్.. రాష్ట్రానికి మోడీ ఏం ఇచ్చారో చెప్పలేకపోయారన్నారు. అసత్యాలు, గ్లోబల్ ప్రచారాలు తప్ప ఏమీ లేదన్న హరీష్.. రాష్ట్రానికి నిధులు ప్రకటిస్తారన్న ప్రజల ఆశలపై మోడీ నీళ్లు చల్లారని తెలిపారు. 18 రాష్ట్రాల సీఎంలు రాష్ట్రానికి వచ్చారని.. తమ రాష్ట్రంలో తెలంగాణ కన్నా అద్భుతమైన పథకం ఉందని ఎవరైనా చెప్పారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి నీళ్లిచ్చాం కాబట్టే సాగు పెరిగిందని తెలిపారు. బీజేపీ నేతలు తెలియకుండా విమర్శలు చేశారని..రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ, వ్యవసాయానికి 24 గంటల కరెంటు లాంటి ఎన్నో పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే .. అసత్యాలను ప్రజలు నమ్మరన్నారు. మేం చేసినవే చెప్పుకుంటున్నామన్న మంత్రి హరీష్.. స్క్రిప్ట్ రైటర్ల తప్పుడు రాతలను బీజేపీ నేతలు చదివిపోయారని తెలిపారు.