కెసిఆర్ పై కిషన్‌రెడ్డి విమర్శలు

కరీంనగర్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఏడేళ్లుగా ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ డబ్బులను నమ్ముకొని ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. అబద్ధం ముందు పుట్టి కేసీఆర్ తర్వాత పుట్టినట్టున్నారని విమర్శించారు. సీఎం కుర్చీ ఎడమకాలి చెప్పుతో సమానం అన్న.. కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కు లేదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/