మరో కీలక పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

పేద బ్రాహ్మణుల కోసం గరుడ సహాయ పథకం ద్వారా రూ. 10 వేల ఆర్థికసాయం

అమరావతి: సీఎం జగన్ మరో కీలక పథకాన్ని ప్రారంభించారు. పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థికసాయాన్ని అందించాలని ఆయన నిర్ణయించారు. పేద బ్రాహ్మణుల అంత్యక్రియలకు రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. గరుడ సహాయ పథకం ద్వారా ఈ సాయాన్ని అందించనున్నారు. ఏడాది ఆదాయం రూ. 75 వేల లోపు ఉన్నవారికి ఈ సాయాన్ని అందిస్తారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు 40 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. http://andhrabrahmin.ap.gov.in వెబ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/