మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గుర్రపు స్వారీ

కాబోయే సీఎం అంటూ అభిమానుల నినాదాలు

revanth-reddy-rides-horse-during-munugodu-by-poll-campaign

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికలో సత్తా చాటి… రాబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని భావిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరపున అలుపెరగకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా గుర్రమెక్కి ఆయన నిర్వహించిన ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. మునుగోడు మండలం కిష్టాపురంలో ఆయన గుర్రంపై ఊరేగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభిమానుల కోరిక మేరకు ఆయన గుర్రమెక్కారు. ఊరు వీధుల గుండా వెళ్తూ, ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభిమానులు ‘కాబోయే సీఎం’ అంటూ నినాదాలు చేశారు.