వీలైనంత త్వరగా ఉక్రెయిన్ వీడండి.. భారతీయులకు ఎంబసీ హెచ్చరిక

indian-embassy-in-kyiv-asks-nationals-to-leave-ukraine-as-soon-as-possible

న్యూఢిల్లీ : ఇండియన్ ఎంబసీ ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను హెచ్చరించింది. వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని సూచించింది. ‘‘ఉక్రెయిన్లో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా భారతీయులు ఇక్కడికి రావొద్దు. భారత పౌరులు, విద్యార్థులు ఇంకా ఉక్రెయిన్ లోనే ఉంటే వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి వెళ్లండి ’’ అని ఎంబసీ సూచించింది.

గత రెండు వారాల క్రితం రష్యా..క్రిమియాను కలిపే కీలకమైన కెర్చ్ వంతెనను కూల్చేశారు. దీనిని కూల్చింది ఉక్రెయిన్ అని ఆరోపిస్తున్న రష్యా.. ఆ దేశంపై క్షిపణి దాడులతో విరుచుకపడుతోంది. దీంతో పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఈ యుద్ధంలో రష్యా అణ్వాయుధాలు ఉపయోగించే అవకాశం ఉందన్న ఆరోపణలతో ఆందోళన నెలకొంది. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని పలు దేశాలు భయపడుతున్నాయి.

మరోవైపు ఉక్రెయిన్లో నాలుగు నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన రష్యా..అక్కడ మార్షల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ చట్టానికి భయపడి కొందరు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. రష్యా ఈ ప్రాంతాలను యుద్ధకేంద్రాలుగా చేసుకుని దాడులను మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది.