ఇకనైనా మీ రాజకీయ విన్యాసాలు ఆపాలి : రేవంత్ రెడ్డి

లక్షల కోట్ల సొమ్ము ఎటుపోతోందంటూ రేవంత్ ప్రశ్న

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తారు. కేసీఆర్ దుష్టపాలనలో రాష్ట్ర ఖజానా దివాలా తీసిందని విమర్శించారు. అప్పుల ద్వారా, భూముల అమ్మకాల ద్వారా, చమురు ధరల పెంపుతో వ్యాట్ ద్వారా, విద్యుత్, భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు, బస్సు చార్జీల పెంపు ద్వారా, మద్యం అమ్మకాల ద్వారా జనం ముక్కుపిండి వసూలు చేస్తున్న లక్షల కోట్ల సొమ్ములు ఎటుపోతున్నాయో? అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఇకనైనా మీ రాజకీయ విన్యాసాలు ఆపి, చిరుద్యోగులైన హోంగార్డులు, మోడల్ స్కూల్స్ సిబ్బందికి వెంటనే మే నెల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే, ఆయా వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/