ప్రమాణ స్వీకరణ కార్యక్రమ ఏర్పాట్లపై డీజీపీ తో రేవంత్ సమీక్ష

revanth

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో స్వీకరణ కార్యక్రమ ఏర్పాట్లపై డీజీపీ తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమీక్షా జరిపారు. ప్రమాణస్వీకారానికి బందోబస్తుపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. రేపటి నుంచి 9వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహించనున్నారు. డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా గెలిచిన ఎమ్మెల్యేలకు భద్రతా కల్పించాలని చెప్పారు. 2ప్లస్ 2 గన్ మెన్లను కేటాయించాలని ఆదేశించారు.