ప్రభాస్ పార్టీ లో రాఘవేంద్ర రావు..

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రాధే శ్యామ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అనుకున్న రీతిలో సక్సెస్ కానప్పటికీ ప్రభాస్ క్రేజ్ కు ఏమాత్రం డోకా లేదు. ప్రస్తుతం సెట్స్ ఫై ఒకటి రెండు కాదు మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆదిపురుష్ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రాజెక్ట్ కె తో పాటు సలార్ మూవీస్ సెట్స్ ఫై ఉన్నాయి.

సైన్స్ ఫిక్షన్ స్టోరీ నేపథ్యంలో ప్రాజెక్ట్ కె తెరకెక్కుతుంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా..బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్ గా బాలీవుడ్ క్రేజీ లేడీ దీపికా పదుకొనె నటిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజా షెడ్యూల్ పూర్తి కావడంతో హీరో ప్రభాస్ టీమ్ అందరికి ప్రత్యేకంగా పార్టీని ఏర్పాటు చేశారట.

దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ పార్టీలో అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, నాని, లతో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రావు కూడా పాల్గొన్నారు. మళ్లీ ఇలాంటి ఫ్రేమ్ కుదరదని ఇలాంటి సందర్భం మళ్లీ రాదని భావించారో ఏమో గానీ హీరో ప్రభాస్ ప్రశాంత్ నీల్ రాఘవేంద్రరావు హీలు నాని దుల్కర్ సల్మాన్ దర్శకుడు నాగ్ అశ్విన్ ..బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రాజెక్ట్ కెని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.