కాంగ్రెస్ విజయం ఫై హరీష్ రావు స్పందన

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు స్పందించారు. ‘ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్‌కు అవకాశమిచ్చిన ప్రజలు ఈ సారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నా. ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన మా పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు.’ అన్నారు.

అలాగే ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. ‘‘ఈ ఎన్నికల్లో కష్టపడిన BRS కుటుంబ సభ్యుల కృషికి ధన్యవాదాలు. మీరు చేసిన పోరాటానికి సోషల్ మీడియా యోధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.అధికారం ఉన్నా, లేకున్నా తెలంగాణ ప్రజల సేవకులమే. మనమందరం మన మాతృభూమి కోసం మనస్ఫూర్తిగా కృషి చేద్దాం’’ అని కవిత తెలిపారు.