చిన్న గౌను లో ఉప్పెన భామ..

ఉప్పెన మూవీ తో ఇండస్ట్రీ కి పరిచమైన కృతి శెట్టి ..మొదటి సినిమాతోనే యూత్ ను కట్టిపడేసింది. ఈ మూవీ తర్వాత అమ్మడు చేసిన బంగార్రాజు , శ్యామ్ సింఘా రాయ్ రెండు కూడా భారీ విజయాలు సాధించాయి. దీంతో అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చాయి. హ్యాట్రిక్ విజయాలను కొట్టిన కృతి..ఆ తర్వాత హ్యాట్రిక్ ప్లాప్స్ చవిచూసింది. ది వారియర్ , మాచెర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూడు సినిమాలు భారీ డిజాస్టర్లు అయ్యాయి. దీంతో అమ్మడికి ఛాన్సులు లేకుండా పోయాయి.

ప్రస్తుతం నాగ చైతన్య తో కస్టడీ మూవీ చేస్తుంది. దీనిపైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే కానీ అమ్మడికి మరో ఛాన్స్..లేదంటే అంతే సంగతి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ సినిమాలు పడేసరికి కృతిశెట్టి సోషల్ మీడియాలోను పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు. గత కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈ భామ ..తాజాగా చిన్న గౌను వేసుకొని ఢిల్లీలో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర అలా ఆహ్లాదంగా సేద తిరుతున్నట్లు పిక్ పోస్ట్ చేసింది. థైస్ అందాలు కనిపించే విధంగా ఈ అమ్మడు ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. క్యూట్ లుక్స్ తో కుర్రాళ్ళకి సైగలు చేస్తున్న ఈ చిన్నది స్వేచ్చగా ప్రకృతిని ఆశ్వాదిస్తూ ఆనందపరవశంలో తేలియాడుతుంది. దీనికి హ్యాపీ సండే అంటూ కృతి పాప క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. చాల రోజుల తర్వాత కృతి నుండి సరికొత్త పిక్ పడేసరికి ఫాలోయర్స్ సంబరాలు చేసుకుంటున్నారు.