11 మందితో రేవంత్ రెడ్డి కాబినెట్ సిద్ధం..

తెలంగాణ రెండో ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే రేవంత్ పాటు మరో 11 మంది ఎమ్మెల్యే లు కూడా ఈరోజు మంత్రులు గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

భట్టి విక్రమార్క (ఉప ముఖ్యమంత్రి)
శ్రీధర్ బాబు
ఉత్తమ్ కుమార్ రెడ్డి
సీతక్క
కోమటి రెడ్డి వెంకట రెడ్డి
తుమ్మల నాగేశ్వర్ రావు
పొన్నం ప్రభాకర్
కొండా సురేఖ
దామోదర రాజనర్సింహ
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జూపల్లి కృష్ణారావు

ఇక LB స్టేడియం లో ప్రమాణ స్వీకరణ పనులు పూర్తి అయ్యాయి. స్టేడియంలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది. ప్రధాన వేదికకు ఎడమవైపున ఉన్న వేదికపై 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూర్చునేలా ఏర్పాటు చేసారు. కుడి వైపున ఉన్న వేదికపై 150 సీట్లను ఏర్పాటు చేశారు. ఈ వేదికను వీవీఐపీలకు కేటాయించారు. వేదిక కింద అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో మరో గ్యాలరీని, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీని ఏర్పాటు చేశారు. స్టేడియంలో 30 వేల మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. స్టేడియం బయట ఉన్నవారు వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.