కామాంధుడు రాఘవ.. ప్రగతి భవన్ లోనా. ఫామ్ హౌస్ లోనా ?- రేవంత్ రెడ్డి

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు కామాందుడు వనమా రాఘవ ఎక్కడ ఉన్నాడు..? నిన్న సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు వచ్చాయి..ఆ తర్వాత మీము ఇంకా అరెస్ట్ చేయలేదు..రెండు రాష్ట్రాల్లో అతడి కోసం గాలింపు చేస్తున్నామని కొత్తగూడెం పోలీసులు అన్నారు. మరి ఇప్పుడు రాఘవ ఎక్కడ ఉన్నాడు..దీనిపైన తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసారు.

కీచవ రాఘవ ఎక్కడ..? ప్రగతి భవన్ లోనా. ఫామ్ హౌస్ లోనా ? ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించే వారిని నిమిషాల్లో అరెస్ట్ చేసి పోలీసులు… మానవ మృగాన్ని రోజుల తరబడి పట్టుకోలేక పోవడం ఏమిటి ? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఆ దుర్మార్గుడుని కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు ? ఇంత దారుణ ఘటనపై టిఆర్ఎస్ పెద్దల మౌనానికి అర్థమేమిటి ..? అని రేవంత్ రెడ్డి వరుస ట్వీట్స్ చేసారు.

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవను కఠినంగా శిక్షించాలని విపక్షాలు, మహిళా సంఘాలు కొత్తగూడెం నియోజకవర్గంలో బంద్‌ కొనసాగిస్తున్నారు. ఈ బంద్‌కు వామపక్షాలు, ప్రజాసంఘాల మద్దతు తెలిపాయి. ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని..రాఘవను ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తున్నారు.