ఈ నెల 12 న తెలంగాణ టెన్త్ పరీక్షల ఫలితాలు..?

ap-ssc-results-date-announced

ఏపీలో శనివారం టెన్త్ పరీక్షల ఫలితాలు రావడం తో తెలంగాణ లో ఎప్పుడు ప్రకటిస్తారో అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 12 న టెన్త్ పరీక్షల ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ నెల 10న ఇంటర్మీడియెట్ ఫలితాలు వెల్లడిస్తారని సమాచారం.

ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు 5,05,625 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలను 7,39,493 మంది విద్యార్థులు రాశారు.

ఇక ఏపీ విషయానికి వస్తే..ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం విడుదల చేసారు. ఈ ఏడాది మొత్తం 72.26 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. గత ఏడాది కంటే ఈ సారి 5 శాతం ఉత్తీర్ణత శాతం పెరిగినట్లుగా మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది కూడా బాలురు కంటే బాలికలదే పై చేయి సాధించినట్లుగా ఆయన తెలిపారు. పరీక్షలకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య 6,09, 081గా ఉంది.. స్పాట్ వ్యాల్యుయేషన్ ఏప్రియల్ 19 నుంచి 26వ తేదీ వరకు పూర్తి చేశాం.. 8 రోజుల్లో స్పాట్ వ్యాల్యుయేషన్ పూర్తి చేశామని.. రికార్డు స్థాయిలో త‌క్కువ‌ రోజుల్లోనే ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తున్నట్టు మంత్రి సత్యనారాయణ తెలిపారు.

ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 72.26గా ఉంది.. గత ఏడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 87. 47 శాతం ఉత్తీర్ణతతో పార్వతి పురం మన్యం జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. 60. 72 శాతంతో చివరి ప్లేస్ లో నంద్యాల జిల్లా ఉన్నది. 933 స్కూళ్లలో విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించారు. 38 స్కూళ్లలో సున్నా ఫలితాలు వచ్చాయి. జూన్ 2 నుంచి సప్లమెంటరీ పరీక్షలు ఉంటాయని మంత్రి బొత్స సత్యనారయణ వెల్లడించారు.