సమయం వచ్చినప్పుడు కెటిఆర్ సిఎం అవుతారు..బొంతు
శ్రీవారిని దర్శించుకున్న బొంతు రామ్మోహన్
bonthu-rammohan-visit-tirumala
తిరుపతి: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బొంతు రామ్మోహన్ కుటుంబంతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల బొంతు రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. సమష్టి నిర్ణయంతోనే కెటిఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని చేపడతారని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ సాధనకు కెటిఆర్‌కు శక్తిని ఇవ్వాలని తాను శ్రీవారిని ప్రార్థించానని చెప్పుకొచ్చారు. సమయం వచ్చినప్పుడు కెటిఆర్ సిఎం అవుతారన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని తెలిపారు.
కాగా, సిఎం కెసిఆర్, మున్సిపల్ శాఖ మంత్రి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలకు సుభిక్షపాలన అందిస్తున్న సిఎం కెసిఆర్‌కు బంగారు తెలంగాణ సాధనకు మరింత శక్తిని ఇవ్వాలని స్వామి వారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/