అసెంబ్లీ స‌మావేశాలు బుధ‌వారానికి వాయిదా

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు బుధ‌వారానికి(మార్చి 9) వాయిదా ప‌డ్డాయి. ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని రెండు గంట‌ల పాటు చ‌దివి వినిపించారు. ఉద‌యం 11:30 గంట‌ల‌కు బ‌డ్జెట్ ప్ర‌సంగం ప్రారంభం కాగా, మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు హ‌రీశ్‌రావు త‌న ప్ర‌సంగాన్ని ముగించారు. అనంత‌రం స‌భ‌ను బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/