రిపబ్లిక్ మూవీ టాక్ : వైసీపీ కి గట్టి కౌంటర్లే పడ్డాయి

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేశ్‌ జంటగా దేవాకట్టా డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ ‘రిపబ్లిక్‌’. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ సినిమా ఈరోజు( అక్టోబర్‌ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. పొలిటికల్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో జిల్లా కలెక్టర్‌గా సాయి తేజ్‌, రాజకీయ నాయకురాలు రమ్యకృష్ణను ఢీకొని ప్రజా సమస్యల మీద తనకున్న పరిథిలో ఎలా పోరాడాడు అన్న కథతో రూపుదిద్దుకుంది. మరి ఈ మూవీ ని చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారో..సోషల్ మీడియా లో ఎలా కామెంట్స్ పెడుతున్నారో చూద్దాం.

దేవా కట్టా విజన్‌ను సాయి ధరమ్ తేజ్ ద్వారా చూపించారు.. తద్వారా ఆయన కెరీర్‌లోనే ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చేట్టు చేశారు. ప్రస్తుతం మన సమాజంలోనే కొన్ని సమస్యలను చూపించారు.. సిస్టింలోని లొసుగులను ఎత్తిచూపారు అంటూ ఓ నెటిజన్ సినిమా గురించి చెప్పుకొచ్చాడు.

దేవా కట్టా సినిమా అంటేనే అర్థవంతమైన భారీ డైలాగ్స్ కి పేరు. పొలిటికల్ డ్రామాలు తెరకెక్కించడంలో తన సత్తా ఏమిటో, ప్రస్థానం సినిమాతో నిరూపించుకున్నారు. రిపబ్లిక్ మూవీలో సైతం దేవా కట్టా అద్భుతమైన డైలాగ్స్ రాశారని , స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా సాగిందని కొందరు అభిప్రాయపడుతుంటే, మరికొందరు పర్వాలేదు అంటున్నారు. సినిమా నేటి రాజకీయ నాయకుల దురాగతాలు, అవినీతిని టార్గెట్ చేస్తూ, ప్రెజెంట్ పొలిటికల్ సినారియోని తెలియజేసేదిగా ఉందని చెపుతున్నారు.

రాజకీయ పార్టీలకు అతీతంగా రిపబ్లిక్ మూవీ ఉందని కొందరు అంటుంటే, మరికొందరు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని, కొన్ని సన్నివేశాలు ఏపీ ప్రభుత్వంపై సెటైర్స్ లా ఉన్నాయి చెపుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద సినిమా తీశాడని, విశాఖ వాణిగా రమ్యకృష్ణ అదరగొట్టేసిందని, సినిమా హిట్ అంటూ సాయి ధరమ్ తేజ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్లు. అధికార పార్టీ లీడర్ గా నెగిటివ్ రోల్ లో రమ్యకృష్ణ, సాయి ధరమ్ తండ్రిగా జగపతిబాబు అదరగొట్టారని , మిగతా నటి నటులు సైతం వారి పరిధిలో బాగానే చేసారని చెపుతున్నారు. ఓవరాల్ గా మూవీ కి పాజిటివ్ టాక్ వినిపిస్తున్నారు.