పవన్ కళ్యాణ్ ఫై విరుచుకుపడిన బాబు మోహన్

రిపబ్లిక్ మూవీ ఫంక్షన్లో ఇండస్ట్రీ తరుపున మాట్లాడిన పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు ఇండస్ట్రీ మద్దతు కూడా లేకుండా పోతుంది. వైసీపీ నేతలే కాదు ఇండస్ట్రీ వ్యక్తులు సైతం పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశం ఏర్పటు చేసి లైవ్ లో బండ బూతులు తిట్టాడు. ఇక ఇండస్ట్రీ సైతం పవన్ చేసిన వ్యాఖ్యలకు , మాకు సంబంధం లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇక సొంత అన్నయ్య చిరంజీవి కూడా వైసీపీ మంత్రి పేర్ని నానికి ఫోన్ చేసి పవన్ వ్యాఖ్యలకు బాధపడుతున్నాని చెప్పినట్లు నాని తెలిపారు. ప్రస్తుతం పవన్ ఫై వైసీపీ నేతలు మాటల దాడి చేస్తూనే ఉన్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ఫై సీనియర్ నటుడు బాబూ మోహన్ ఘాటుగా స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) ఎన్నికలలో మంచు విష్ణు ప్యానల్ తరపున ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్ పోటీ చేస్తున్నారు. మా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

”ప్రభుత్వ సహకారం ఇండస్ట్రీకి అవసరం. ఏపీ ప్రభుత్వాన్ని సినీ ప్రముఖులు ఓ విషయం అడిగారు. దానికి వాళ్ళు సరే అన్నారు. దాన్ని విమర్శించి అది చిన్నోళ్లకు ఉపయోగపడుతుంది పెద్దోళ్లకు ఉపయోగపడదు అంటూ పవన్ ఏదేదో మాట్లాడారు. పవన్ కల్యాణ్ అన్ని మాటలు మాట్లాడారు కదా.. ఆయన తేల్చుకోవాలి.. ఇండస్ట్రీ బాగుంటే మనందరం బాగుంటాం. ఆయన ఇండస్ట్రీ సైడా? ప్రకాశ్ రాజ్ సైడా? అనేది ముందుగా తేల్చుకోవాలి అని బాబు మోహన్ అన్నారు. అక్కడి తో ఆగకుండా ”నీ వ్యక్తిగతమా? నీ సొమ్ము తిన్నాడా? నీ రెమ్యూనరేషన్ గుంజుకున్నాడా? నీ అవకాశాన్ని తీసుకున్నాడా? ఎందుకయ్యా నీకు అంత ఫ్రస్ట్రేషన్. ఓ అంటూ ఊగిపోవడం ఎందుకు? చక్కగా నవ్వుతూ మాట్లాడుకోవచ్చు కదా. ఏదో నీ ఇల్లు గుంజుకొని ఇల్లు కాలబెట్టి.. నీ బ్యాంక్ బ్యాలన్స్ అంతా తీసుకున్నట్లు. పది పైసల నష్టం అయినా జరిగిందా నీకు? వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల మన సినిమా ఇండస్ట్రీ పరువు పోతోంది. సినిమా యాక్టర్స్ అంటే ఇదా అని అందరూ అంటున్నారు. నీకు అంత పెద్ద అవమానం – అన్యాయం – ద్రోహం జరిగితే ఎందుకు పెద్ద మనుషులతో కూర్చొని సాల్వ్ చేసుకోకూడదు?” అని అన్నారు.