ఈ నెలలో బ్యాంకులకు 21 రోజులపాటు సెలవులు

నెల మారిందంటే ముందుగా బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ అవుతారు. ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయి..ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు అనేవి చూస్తుంటారు. వాటిని బట్టి తమ బ్యాంకు పనులను చేసుకుంటుంటారు. ఇక ఈరోజు నుండి అక్టోబర్ నెల మొదలైంది. ఈ నెలలలో బ్యాంకులకు ఏకంగా 21 సెలవులు వచ్చాయి. 14 రోజులు ఆర్‌బీఐ అధికారిక సెలవులు కాగా, మిగతా 7 రోజులు వీకెండ్ హాలిడేస్ వచ్చాయి.

అక్టోబర్ 1 – అర్ధ సంవత్సర క్లోజింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ (గ్యాంగ్‌టక్), అక్టోబర్ 2 – గాంధీ జయంతి (అన్ని రాష్ట్రాల్లో సెలవు), అక్టోబర్ 3 – ఆదివారం, అక్టోబర్ 6 – మహాలయ అమవాస్య (అగర్తల, బెంగళూరు, కోల్‌కతా), అక్టోబర్ 7 – మేరా చౌరెన్ హుబ ఆఫ్ లైనింగ్‌తో సనామహి (ఇంపాల్), అక్టోబర్ 9 – రెండో శనివారం, అక్టోబర్ 10- ఆదివారం, అక్టోబర్ 12- దుర్గా పూజ (అగర్తల, కోల్‌కతా).

అక్టోబర్ 13- మహాష్టమి (పలు రాష్ట్రాల్లో), అక్టోబర్ 14 – దుర్గా పూజ (పలు రాష్ట్రాల్లో), అక్టోబర్ 15 – దసరా ( ఇంపాల్, సిమ్లా మినహా అన్ని రాష్ట్రాలలో సెలవు), అక్టోబర్ 16 – దుర్గా పూజ (గ్యాంగ్‌టక్), అక్టోబర్ 17- ఆదివారం, అక్టోబర్ 18- కటి బిహు (గువాహతి), అక్టోబర్ 19 – ఈద్ ఇ మిలాద్ ( తెలుగు రాష్ట్రాల్లో సెలవు), అక్టోబర్ 20- మహర్షి వాల్మికి పుట్టిన రోజు (పలు రాష్ట్రాల్లో), అక్టోబర్ 22 – ఈద్ ఇ మిలాద్ (జమ్మూ శ్రీనర్), అక్టోబర్ 23 – నాలుగో శనివారం, అక్టోబర్ 24 – ఆదివారం, అక్టోబర్ 26 – అసెషన్ డే (జమ్మూ శ్రీనగర్), అక్టోబర్ 31 – ఆదివారం ఇలా మొత్తం 21 రోజులు సెలవులు వచ్చాయి.

ఈరోజు నుండి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏటీఎంలు కనిపించవు. అక్టోబర్ 1 నుంచి బ్యాంక్ ఏటీఎంలు పని చేయవు. బ్యాంక్ అన్ని ఏటీఎంలను మూసివేయాని నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ ఇప్పటికే కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేసింది. కస్టమర్లు వారి డెబిట్ కార్డుల ద్వారా ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నుంచి డబ్బులు తీసుకోవచ్చని సూచించింది. చాలా మంది తమ బ్యాంక్ ఏటీఎంలను ఉపయోగించడం లేదని, అందుకే ఈ సర్వీసులను నిలిపివేస్తున్నామని బ్యాంక్ తెలిపింది.