ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి లో సీఎం రేవంత్ రెడ్డి సభ

CM Revanth Sabha in Indravelli on February 2

ఆదిలాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క , కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం సభకు త్వరగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండొద్దన్నారు. కాగా, ఇంద్రవెల్లి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించిన ఆయన సీఎం అయిన తర్వాత కూడా తొలి సభను అక్కడే నిర్వహించబోతున్నారు. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనానికి శంఖుస్థాపన చేయనున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి సభ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.