లోకేష్ కోసం జూ.ఎన్టీఆర్ ను తొక్కేస్తున్నారంటూ కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

వైస్సార్సీపీ మాజీ మంత్రి , ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా టీడీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. లోకేష్‌కు అడ్డొస్తాడనే కారణంగానే.. జూ ఎన్టీఆర్‌ ను తొక్కేస్తున్నారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఏపీని ఆక్రమించాలని ఓ కులం పన్నాగాలు పన్నుతోందని.. టీడీపీ పార్టీ కుట్రలను అడ్డుకోవాలని కొడాలి నాని పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్ డీఎన్ఏ అయిన బీసీలను సమూలంగా నాశనం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని అక్రమించాలని పన్నాగాలు పన్నుతున్నారన్న కొడాలి నాని.. జోగి రమేష్ మంత్రి అయితే తాను, పేర్ని నాని, వల్లభనేని వంశీ మత్రులు అయినట్లేనని వెల్లడించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ కలిస్తే ఉండేంత దమ్ము ధైర్యం కేవలం జగన్ కు మాత్రమే ఉందని, అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఏపీ ప్రజలకు ఉందని కొడాలి నాని స్పష్టం చేశారు.