పొత్తులపై మాజీ మంత్రి పేర్ని నాని క్లారిటీ

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ..ఇప్పటి నుండే పొత్తుల వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నాడని..రాబోయే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగాలని సోనియాకు సూచించాడనే వార్తలు వైరల్ గా మారాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో చర్చ గా మారింది. ఈ క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని పొత్తుల వ్యవహారం ఫై క్లారిటీ ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని అన్నారు. తమది పోరాటం అయితే తెలుగుదేశం- జనసేన పార్టీలది వావీవరుసలు లేని ఆరాటం అని పేర్కొన్నారు. బీజేపీని అనరాని మాటలు అన్నారని, తిరిగి ఆ రెండు పార్టీలు తిట్టిన పార్టీతో పొత్తుకు ఆరాట పడుతున్నాయన్నారు. బీజేపీతో కలిసి ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేకూర్చారో చెప్పాలన్నారు.

అలాగే ప్రశాంత్ కిషోర్ ను తాము కన్సల్టెంట్ గానే నియమించుకున్నామని …ఆయన చెప్పిన వాటన్నింటిని చేయాలనే నిబంధన ఏదీ లేదని , కాంగ్రెస్ తో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు.