2008లో అతనితో బ్యూటిఫుల్ రిలేషన్

చాలా పర్సనల్ పేరు చెప్పను: అనుష్క

Actress Anushka

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పై లవ్ రూమర్లు.. పెళ్ళి పుకార్లు ఈనాటివి కాదు. అనుష్కను అందరూ స్వీటీ అని పిలుస్తూ ఉంటారు..

వెరీ స్వీట్ అంటూ ఉంటారు కానీ ఈ విషయంలో మాత్రం యమా హాటీనే. ఎప్పుడు తనపై ఇలాంటి గాసిప్పులు వచ్చినా సరే స్వీటీ వెంటనే ‘నో ‘ అనేస్తుంది.
తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడింది.

“నేను 2008 లో ఒకరితో నాకు బ్యూటిఫుల్ రిలేషన్ ఉండేది. అతనితో ఇప్పటికీ కలిసి ఉంటే మాత్రం పేరు చెప్పేదాన్ని. చాలా పర్సనల్ విషయం కాబట్టి నేను అతని పేరు మాత్రం చెప్పను.

ఇప్పటికీ అది గౌరవప్రదమైన రిలేషన్. నేను పెళ్లి చేసుకున్న రోజు అది అందరికీ తెలిసిపోతుంది” అంటూ అసలు విషయం చెప్పకుండా ప్రేక్షకులకు ఓ పజిల్ విసిరింది.

అర్థం చేసుకున్నవారికి అర్థం చేసుకున్నంత అర్థం అవుతుంది లేదంటే లేదు. వివాహం చేసుకున్న వెంటనే అతనెవరో అర్థం అవుతుందని ఓ హింట్ ఇచ్చిందంటే ఆ హీరోతో ఇంకా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉన్నట్టే కదా. అంటున్నారు జనాలు..

తాజా ‘చెలి’ శీర్షికల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/women/