ఆదిభట్ల కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

ఆదిభట్ల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. రాగన్నగూడకు చెందిన వైశాలి ని గత కొద్దీ రోజులుగా
నవీన్ రెడ్డి అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో వైశాలి ఇంట్లో పెండ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం వైశాలి కి పెండ్లి చూపులు ఏర్పాటు చేయగా..ఇది తెలుసుకున్న నవీన్‌ రెడ్డి అనే యువకుడు వందమంది యువకులతో కలిసి సదరు యువతి ఇంటికి వచ్చి దాడి చేశాడు. అనంతరం యువతిని బలవంతంగా లాక్కెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మధ్యాహ్నం నుంచి అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లారు.. ఏం చేశారు.. అంటూ అమ్మాయి తరఫు బంధులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేశారు. అటు పోలీసులపై కూడా తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. నవీన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు కూడా ధ్వంసం చేశారు. చివరికి.. అమ్మాయి తన తండ్రి దామోదర్‌కి ఫోన్ చేసింది వైశాలి. తాను సిటీలోనే ఉన్నానని తెలిపిన వైశాలి.. సేఫ్‌గానే ఉన్నానని చెప్పింది. తన గురించి ఆందోళన చెందవద్దని చెప్పింది. దీంతో.. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు ఆమె ఉన్న చోటును గుర్తించారు. సినిమాల్లో చూపించిన విధంగా.. హుటాహుటిన వాళ్లున్న ప్లేస్‌కి వెళ్లి.. కిడ్నాపర్లను పట్టుకున్నారు. వైశాలిని వాళ్ల నుంచి రక్షించారు. నవీన్‌ రెడ్డితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.