రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు ఊరట..

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు భారీ ఊరట లభించింది. అంతర్వేదిలో ఓ పబ్లిక్ మీటింగ్ లో రాపాక మాట్లాడుతూ.. తాను ఎన్నికల్లో గెలు పొందేందుకు దొంగ ఓట్లు దోహదపడినట్లు కీలక వ్యాఖ్యలు చేసారు.

ఈ వాఖ్యల ఫై కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన ఎనుముల వెంకటపతిరాజా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి చేసిన పిర్యాదు చేయడం తో.. ఎన్నికల కమిషనర్ ఆదేశాలు మేరకు రాపాక వర ప్రసాద్ తో పాటుగా మరో ఎనిమిది మందిని విచారణ చేసి, వీరి నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకున్నారు కలెక్టర్. ఈ విచారణలో గత ఎన్నికల్లో తాము అసలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఓట్లు వేయలేదని వైస్సార్సీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. తాము వైస్సార్సీపీ కార్యకర్తలమని, అలాంటిది జనసేన తరపున పోటీ చేసిన ఎమ్మెల్యేకు ఏ విధంగా దొంగ ఓట్లు వేస్తామని తెలిపారు. ఇక దీనిపై పూర్తిస్థాయి నివేదికను ఎన్నికల కమీషన్ కు అందజేయనుంది కలెక్టర్.