పొత్తులపై పవన్ క్లారిటీ..వెన్నుపోటు పొడిచాడంటూ వర్మ ఫైర్

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ..మరోసారి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. తన ఫ్యాన్స్ కు వెన్నుపోటు పొడిచి చంపేసాడని మండిపడ్డారు. గురువారం మంగళగిరి జనసేన ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటామని తేల్చి చెప్పారు.

అయితే.. దీనిపై వర్మ కౌంటర్‌ ఇచ్చారు. ఆ రోజు NTR ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన దానికన్నా దారుణంగా ఈ రోజు… తన జనసైనికులు, తన ఫ్యాన్స్ కు వెన్నుపోటు పొడిచి పవన్‌ కళ్యాణ్‌ చంపేసాడు.. వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్‌ చేశారు. తన సొంత ఫ్యాన్స్ నే కాకుండా, తన కాపుల్ని, చివరికి తనని తానే వెన్నుపోటు పొడిచేసుకున్నాడంటూ మండిపడ్డారు వర్మ.

https://twitter.com/RGVzoomin/status/1656681971001720832?s=20
https://twitter.com/RGVzoomin/status/1656677358240419842?s=20