మూడు రాజధానులపై కేంద్రం మరింత క్లారిటీ

మూడు రాజధానుల ఏర్పాటులో ఎలాంటి తప్పు లేదు..కేంద్రం

ap high court
ap high court

అమరావతి: ఏపిలో మూడు రాజధానుల అంశం పై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. ఒక రాజధాని మాత్రమే ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులను ఏర్పాటు చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పింది. మూడు రాజధానుల అంశంలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. మూడు రాజధానుల అంశంపై ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ఏపి హైకోర్టులో ఇప్పటికే కేంద్రం రెండు సార్లు అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా మరో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానులను అడ్డుకోగలిగే అధికారం కేంద్రానికి ఉందనేది పిటిషనర్ దోనె సాంబశివరావు అపోహ మాత్రమేనని తెలిపింది. ఏపి రాజధాని నిర్మాణానికి సాయం చేస్తామని మాత్రమే తాము చెప్పిమని వెల్లడించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/