రియల్ మీ లో 5జీ ప్రీమియం స్మార్ ఫోన్

Realme Lo 5G premium smart phone

హైదరాబాద్ః దేశంలో 5 జీ సేవలు వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రియల్మీ అత్యాధునికి ఫీచర్లతో రూపొందించిన 5జీ ప్రిమియం స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో రియల్మీ నార్జో 60 ప్రో 5 జీ స్మార్ట్‌ ఫోన్‌తో పాటు రియల్మీ బడ్స్‌ వైర్‌లెస్‌ 3 ను ఆ సంస్థ మార్కెటింగ్ స్ట్రాటజీ హెడ్‌ మనీశ్‌ రానా ఆవిష్కరించారు. దేశంలోనే మొదటి సారిగా 1టీబీ సామర్థ్యంతో రూపొందించిన ఏకైక స్మార్ట్‌ఫోన్ రియల్మీ నార్జో స్మార్ట్‌ ఫోన్‌ అని మనీశ్‌రానా అన్నారు. ఇదీ మార్స్ ఆరెంజ్, కాస్మిక్ బ్లాక్ కలర్‌ రెండు కలర్స్‌ తయారు చేసినట్లు చెప్పారు. రియల్మీ బడ్స్‌ వైర్‌లెస్‌ 3 ఎయిర్‌ఫోన్‌ బాస్ ఎల్లో, వైటాలిటీ వైట్, ప్యూర్ బ్లాక్ లభిస్తాయన్నారు. బడ్స్‌ వెర్‌లెస్‌ ధర రూ. 1799, 1699 నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రియల్మీ నార్జో 60 ప్రో ధర రూ. 17999 నుంచి రూ. 19999 అందిస్తున్నట్లు వివరించారు..