హైదారాబాద్ ఎయిర్ పోర్ట్ లో చరణ్ కు ఘనస్వాగతం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆర్ఆర్ఆర్ మూవీ తో వరల్డ్ వైడ్ గా పాపులార్టీ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలు గా తెరకెక్కిన ఈ మూవీ పలు భాషల్లో విడుదలై భారీ విజయం సాధించింది. టాక్ పరంగానే కాదు కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త రికార్డ్స్ నెలకొల్పింది. రీసెంట్ గా సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ దక్కడం తో హాలీవుడ్ స్థాయిలో సినిమా గురించి , చిత్ర యూనిట్ గురించి అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

అమెరికా నుండి హైదరాబాద్ కు వచ్చిన చిత్ర బృందానికి అభిమానులు గ్రాండ్ వెల్ కం తెలుపగా..ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కోసం అమెరికాకు వెళ్లిన చరణ్ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. తన భార్య ఉపాసనతో కలిసి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న చరణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. జై చరణ్… జై ఎన్టీఆర్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. పూలు చల్లుతూ అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా అభిమానులకు అభివాదం చేసిన చరణ్… తనపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత చరణ్ వాహనం వెనుకే అభిమానులు తమ వాహనాల్లో ర్యాలీగా వెళ్లారు.

అంతకు ముందు ఢిల్లీ లో కేంద్రమంత్రి అమిత్ షా తో మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ఓ ఛానల్ కాంక్లేవ్‌కు హాజరయ్యేందుకు వచ్చిన వీరు హోటల్‌లో భేటీ అయ్యారు. RRR సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన నేపథ్యంలో రామ్ చరణ్‌కు హోం మంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. రామ్ చరణ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. కేంద్ర మంత్రిని చిరంజీవి శాలువాతో సత్కరించారు. సుమారు 15 నిమిషాల పాటు వీరి భేటీ కొనిసాగినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.