ఉండవల్లి శ్రీదేవి..సినీనటి శ్రీదేవి కంటే గొప్పగా నటిస్తుంది – గుడివాడ అమర్ నాథ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైస్సార్సీపీ నలుగురు ఎమ్మెల్యేల ఫై వేటు వేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ కు గురైన ఎమ్మెల్యేలు వరుసపెట్టి మీడియా చానెల్స్ తో మాట్లాడుతూ వైస్సార్సీపీ ఫై నిప్పులు కురిపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెపుతారని అంటున్నారు. ఇక ఈరోజు మీడియా తో సమావేశమైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

గత మూడు రోజులు గా వైస్సార్సీపీ గుండాలు నన్ను వేధిస్తున్నారని , నేను అజ్ఞాతం లో ఉన్నానని అంటున్నారని.. మొన్న డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళ లాగా నన్ను చంపుతారు అని అజ్ఞాతం లోకి వెళ్ళానని తెలిపింది. వాళ్ళ దందాలకు నేను అడ్డు వస్తున్నాను అని ఇలా చేస్తున్నారు. నేను ఓటు వేసే టేబుల్ కింద ఎవరైనా కూర్చున్నారా అని నిలదీశారు. లేదా సీసీ కెమెరా పెట్టారా అని ప్రశ్నించారు. నేను ఓటు వేసే ప్యానెల్ లో జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు. మిగతా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు అనుమానం పడట్లేదు.. నన్ను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. అంతే కాకుండా దోచుకో, దాచుకో, పంచుకో అని జగన్ చెబుతున్నారని, తాను అలా చేయబోనని తెలిసి పార్టీ నుంచి తొలగించారని ఆమె ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో ఇసుక దందాలు, దోపిడీలకు పాల్పడ్డారని ఉండవల్లి శ్రీదేవి ఆరోపణలు చేశారు.

ఇక ఉండవల్లి శ్రీదేవి ఆరోపణలపై మంత్రి గుడివాడ అమర్ నాధ్ స్పందించారు. ఉండవల్లి శ్రీదేవి కాదని ఊసరవెల్లి శ్రీదేవని విమర్శించారు. సినీనటి శ్రీదేవిని మించిన గొప్ప నటి అని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా కనిపించని లోపాలు ఆమెకు ఇప్పుడే కనిపించాయా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేసే ముందు సీఎం జగన్ వద్దకు కూతురుని తీసుకెళ్లి ఫొటో దిగిందని… ఆయనను అభిమాని అని నమ్మించి మోసం చేయాలని భావించిందని అన్నారు. శ్రీదేవి వంటి నమ్మక ద్రోహుల గురించి మాట్లాడటమే వేస్ట్ అని అన్నారు.